నీ విలువ నువ్వు తెలుసుకో ఎంటర్ ప్రెన్యురియల్ స్పిరిట్ ను మేల్కొలుపు: “ఎంత గొప్పస్థాయి వాళ్ళు అయినా నీతో పరిచయం కావాలి అనుకునేంత విలువైన వాడివి అయి ఉండు,నీతో స్నేహం చేయాలనుకునేంత గొప్పవాడివై ఉండు ” ఏదైనా సాధించాలన్నా తపన ఉండాలి . అది సాధించేవరకు మనిషికి సంతృప్తి ఉండకూడదు . సాధించిన తరువాత అందులో కిక్ లభించాలి . అందులో ఆనందం లభించాలి . విజయం సాధించడంలో కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని వాటిని ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా సాధించడమనేది కార్యసాధకుని లక్షణం . ఒక కార్యసాధకుని వ్యక్తిత్వాన్ని బాగా ఒంట పట్టించుకోవాలి . అంకితభావం , పట్టుదల , క్రమ శిక్షణ , దైర్యం , ఆత్మ విశ్వాసం , సాహసం వంటి అద్భుతమైన లక్షణాలతో ఒక దాని తరువాత ఒకటి లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధిస్తూ .. అందులో అమితమైన ఆనందాన్ని పొందగలగాలి . ఒక ఎంటర్ ప్రెన్యూర్ లా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి . ఈ ప్రపంచంలో ఎంటర్ ప్రెన్యూర్ అంటే ఒక రియల్ హీరో . ఎంతో దైర్య సాహసాలతో ఎంతో రిస్క్ తీసుకుని ఎన్ని సమస్యలతో అయినా పో...
ఆధ్యాత్మికతే – విజయానికి రాజ మార్గం బ్రహ్మ జ్ఞానమే మానవ జాతికి రక్ష: “ సద్గుణాలే అసలైన ధనం, గొప్ప అలవాట్లే.. నిజమైన సంపద ” మానవ జాతిని పట్టి పీడిస్తున్న ఎన్నో చెడు వ్యసనాలకు ఆధ్యాత్మికత ఒక అత్యద్భుత పరిష్కారం.నాస్తికవాదులు,హేతువాదులు నిజాలు చెప్తున్నామని ప్రకటించుకుంటూ నేటి తరానికి అన్యాయం చేయాలని చూస్తున్నారు. ప్రస్తుత తరంలో ఎన్ని ఆవిష్కరణలు ఉన్నాయో.. అంతకు మించి ఆకర్షణలు ఉన్నాయి.ఇలాంటి తరానికి హిందూ మతం, సంస్కృతి,ఆధ్యాత్మికత ఒక రక్షణ కవచంలా కాపాడే అవకాశం ఉంది. మనుషుల స్వీయ నియంత్రణను,బలహీనతలను టార్గెట్ చేస్తూ.. కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది.ఇలాంటి తరుణంలో .. ఆధ్యాత్మిక జ్ఞానం,భక్తి సంస్కారం మనుషులను జితేంద్రియులుగా,స్వాధ్యాయంతో సదభ్యాసపరులు గా మారుస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పురుషులందు పుణ్య పురుషులు వేరయా: “ బ్రహ్మకైనా పుట్టు రిమ్మ తెగులు” అని ఎవరు అన్నారో కానీ, అతనికి ఖచ్చితంగా జితేంద్రియత్వం ఎలా సాధించాలో తెలిసి ఉండదు. ఒక మనిషి కామాన్ని జయించగలిగితేనే అతడు నిజంగా పుణ్య పురుషుడు అని అర్ధ...